మైనారిటీల హక్కుల కోసం పోరాటం మొహమ్మద్ ముజాహిద్

viswatelangana.com
తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం ₹3300 కోట్లు బడ్జెట్ కేటాయించినప్పటికీ, గత ఏడాదిలో కేవలం ₹1100 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన నిధులు కొత్త బడ్జెట్ రాకముందే తిరిగి వెళ్లిపోతాయని తెలుస్తోంది. ప్రభుత్వం మైనారిటీలను మోసం చేస్తోందని, పేద ముస్లింలు ఇంకా అభివృద్ధి చెందకపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముజాహిద్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. “మైనారిటీ శాఖలకు 6 ఛైర్మన్లు ఉన్న, వారిలో ఒక్కరు కూడా మైనారిటీలకు అండగా లేరు. మైనారిటీ ప్రజలకు ఈ ప్రభుత్వంపై, ఆరు చైర్మన్లపై నమ్మకం పోయింది అని ముజాహిద్ అన్నారు. మైనారిటీల కోసం ఎవరో పోరాడాలి. ఎవరైనా గళం విప్పాలి. ముజాహిద్ లేనిదే మా సమస్యల కోసం ప్రభుత్వం కదలదు. ఆయన పోరాటం వల్లే మేము ఇంకా న్యాయాన్ని ఆశించగలుగుతున్నాం” అని ముస్లిం మైనారిటీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “పేద ముస్లింలు ఇంకా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మైనారిటీలను అభివృద్ధి చేయాలని చెబుతూ మోసం చేస్తోంది అని మండిపడ్డారు. ఇప్పటికే రంజాన్ సమీపిస్తున్న నేపథ్యంలో, మైనారిటీల కోసం కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని, ప్రభుత్వ వ్యవస్థలు సమర్థంగా పనిచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం బాధ్యతగా వ్యవహరించాలని, నిధులు ఖర్చు చేయకపోతే మైనార్టీల భవిష్యత్తు ఎలా అని తీవ్రంగా ప్రశ్నించారు?



