రాయికల్ మండల ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
viswatelangana.com
ప్రజలకు ప్రభుత్వానికి వారధి గా ప్రజా సమస్యల పరిష్కారానికి సారదులుగా పాత్రికేయులు నిలుస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ పట్టణంలోని వర్తక సంఘ భవనంలో రాయికల్ మండల ప్రెస్ క్లబ్ (జేఏసీ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణంలో పాత్రికేయుల పాత్ర ఎంతో ఉందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పాత్రికేయులతోనే సమాజంలోని అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని అన్నారు.పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేస్తానని ప్రెస్ క్లబ్ భవనం, పాత్రికేయులకు ఇళ్ల స్థలాల మంజూరుకి కృషి చేస్తానన్నారు. జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాయికల్ మండలంలో పాత్రికేయ రంగంలో పనిచేసిన సీనియర్ పాత్రికేయులను ఘనంగా సత్కరించారు. అలాగే ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పాత్రికేయుడు ముంజ ధర్మపురి కుటుంబానికి రూ.31500 ఆర్థిక సాయాన్ని అందజేశారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన ప్రెస్ క్లబ్ జేఏసీ కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ జేఏసీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు ఎంపీపీ లౌవుడియ సంధ్యారాణి జడ్పీటీసీ జాదవ్ అశ్విని వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి సింగిల్ విండో చైర్మన్ మల్లారెడ్డి తాహాసిల్దార్ ఖయ్యూం ఎంపీడీవో సంతోష్ కుమార్ ఎస్సై అజయ్ జగిత్యాల జిల్లా పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు కిషన్ రెడ్డి రాయికల్ మండల జేఏసీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వాసరి రవి ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ కోశాధికారి మచ్చ శేఖర్ నాగిరెడ్డి రఘుపతి చింతకుంట సాయికుమార్ గంగాధరి సురేష్ ఏద్దండి ముత్యపు రాజు రెడ్డి సీనియర్ జర్నలిస్టులు శంకరయ్య శ్రీకర్ నరేందర్ రెడ్డి శ్రీనివాస్ వెంకటరమణ రవి రసూల్ విజయ్ లింబాద్రి గంగాధర్ గట్టుపల్లి నరేష్ కుమార్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



