స్థానిక ఎన్నికలకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలి
సిపిఐ జాతీయ నేత చాడవెంకటరెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు

viswatelangana.com
శనివారం రోజున జగిత్యాల జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం కోరుట్ల డివిజన్ లో సి.ప్రభాకర్ భవన్ లో సుతారిరాములు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ… వంద సంవత్సరాల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ ప్రజా పక్షాన నిరంతరం సంక్షేమం కోసం పోరాడి సాధించింది. మోడీ ప్రభుత్వంలో పేదలకు రక్షణ లేదని కార్మిక చట్టాలు నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మలచిందన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. పేదలకు ఇండ్ల నిర్మాణం ఆసరా పెన్షన్లు ఇవ్వాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తామన్నారు. ముందుగా పార్టీ స్థలంలో ఎర్రజెండాను సిపిఐ జాతీయ నేత మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి ఎగురవేసారు. సిపిఐ జాతీయ నాయకులు కలవేని శంకర్, సిపిఐ సీనియర్ నేతలు చెన్న విశ్వనాథం, ఎండి మౌలానా, సుతారి రాములు, కొక్కుల శాంత, ఎన్నం రాధ, ఉస్మాన్, అక్రమ్, రామిల్ల రాంబాబు, గోధుర్ మురళి, భూమ రెడ్డి, వెన్న మహేశ్, దేవదాస్త తదితరులు పాల్గొన్నారు.



