ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం – ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్
త్వరలో కలికోట సూరమ్మ చేరవు ప్రాజెక్టు పూర్తి చేస్తాం

viswatelangana.com
కథలాపూర్ మండలం దుంపేట, దులూరు గ్రామంల్లో శుక్రవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటించారు..దులూరు గ్రామంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సాగునీటి రంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని, అందులో భాగంగా రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల్లో మొదటి ప్రాధన్యత క్రమంలో వేములవాడ నియోజకవర్గం నుండి కలికొట సూరమ్మ చేరవు ప్రాజెక్టు ఉందని ,ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు.కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టుపై గత ప్రభుత్వం వారు కపట ప్రేమ చూపెట్టారని అన్నారు.. ప్రాజెక్ట్ పూర్తయితే కథలాపూర్ భీమారం మేడిపల్లి మండలాల ఇందులో సుమారు 43వెలు ఎకరాలకు నీరు అందుతుందన్నారు. కానీ గత పాలకులు ఎన్నికల్లో ఓట్ల కోసమే శంకుస్థాపన చేశారని, ప్రాజెక్టు పరిధిలో తట్టెడు మట్టి కూడ తియ్యలేదని అన్నారు. ప్రాజెక్టు ప్రారంభించారని గతంలో ధర్నాలు,రాస్తారోకాలు చేశామని కానీ లేదా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదన్నారు. రాళ్ల వాగు ప్రాజెక్టు నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిదిలో ఉందనీ, ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఏదో ఒక ప్రాంతానికి అప్పజెప్పాలని అధికారులను కోరినట్లు తెలిపారు.. దిని ద్వార కథలాపూర్ మండల పరిధిలో సుమారు 3000 ఎకరాలకు సాగును నీరు అందించే దిశగా చర్యలు చేడుతున్నామన్నారు. గతంలో గెలిచిన నాయకులు ఎమ్మెల్యే పదవిని తమ హోదకు చిహ్నంగా వాడుకున్నారే తప్ప గెలిచి ఈ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు.. సబ్బండ వర్గాల ఆశీస్సులతో గెలిచిన రోజే నా ఎమ్మెల్యే పదవిని నియోజకవర్గ ప్రజలకు అంకితం చేశారని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచిన రెండు రోజుల్లోనే మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచామన్నారు. గృహలక్ష్మి పథకంలో భాగంగా 200 వందల యూనిట్ల వరకు విద్యుత్ పై జీరో బిల్ ఇస్తున్నామని పేర్కొన్నారు.ఆర్టీసీ బస్ లో జీరో టికెట్ మాదిరిగా, జీరో కరెంటు బిల్లు ఇస్తున్నామని,గతంలో 500రూపాయలు ఉన్న సిలిండర్ ధరకే,నేడు కాంగ్రేస్ ప్రభుత్వంలో అదే ధరకు ప్రజలకు అందిస్తున్న ఘనత కాంగ్రేస్ ప్రభుత్వానిదన్నారు..మొన్నటి రోజున కేటీఆర్,హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అని మాట్లాడడం చూస్తే అసలు వారికి బుద్ధుండే మాట్లాడుతున్నారా అని అనిపిస్తుంది అన్నారు.. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం చలికాలంలో ఏర్పడిందని, వేసవికాలం అయిపోయి వర్షాకాలంలో వర్షాలు పడకుంటే కరువు వచ్చిందంటే ఒక అర్థం ఉంటుందని కానీ ఇప్పుడు కేటీఆర్,హరీష్ రావు మాటలు చూస్తుంటే అధికారం కోల్పోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారన్నారు.. మేడిగడ్డలో 7 టీఎంసీల నీటిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందుకే వదిలిపెట్టారని, ఎన్నికల కంటే ముందు మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోయిందని రిపోర్టు రాగానే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆగ మేగల మీద తమ లోటుపాట్లు ఎక్కడ బయటపడతాయని భయపడి మేడిగడ్డలోని నీటిని సముద్రంలోకి వదిలేశారన్నారు. సాక్షాత్తు మీ మామ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడని, నేనే ఇంజనీర్ గొప్పలు చెప్పి లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు.. వేములవాడ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా,ప్రజా సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు



