రాయికల్
ప్రతి స్త్రీ అమ్మవారి శక్తి స్వరూపము

viswatelangana.com
September 13th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గుడేటి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పంతులు శివశంకర శర్మ ప్రత్యేక పూజలు, మహిళలచే కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా శివ శర్మ మాట్లాడుతూ ప్రతి స్త్రీ అమ్మవారి శక్తి స్వరూపమని, మహిళలు పూజ చేస్తున్న సమయంలో అమ్మవారు వారిలో తన రూపాన్ని చూసుకుంటుందని అన్నారు.. అనంతరం భక్తులకు, మహిళలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడేటి రెడ్డి సంఘం అధ్యక్షులు గడ్డం అంజిరెడ్డి, కోశాధికారి ఏలేటి రవీందర్ రెడ్డి, కార్యదర్శి బద్దం రామ్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎలేటి నరసింహారెడ్డి, సలహాదారులు, ఎడమల విజయ్ రెడ్డి, సోమనారాయణ రెడ్డి, సంఘ సభ్యులు, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



