రాయికల్

రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైన కుమ్మరి పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు

viswatelangana.com

December 8th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల లోని పురాతన ఉన్నత పాఠశాలలో గత రెండు రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో రాయికల్ మండలంలోని కుమ్మరిపల్లె ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కడకుంట్ల అభయ్ రాజ్ బోధనోపకరణాల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి సాధించి రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి రాము చేతుల మీదుగా ప్రశంసా పత్రం, జ్ణాపిక అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అభయ్ రాజ్ ను మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు,పీఆర్ టీయూ జిల్లా అధ్యక్షుడు ఆనందరావు, ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి, రాష్ట్ర బాధ్యులు పొన్నం రమేష్, మండల అధ్యక్షులు అంతడుపుల గంగారాజం, ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్య తదితరులు అభినందించారు.

Related Articles

Back to top button