కల్లూరు బ్రిడ్జి సందర్శన… కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు

viswatelangana.com
కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కల్లూరు బ్రిడ్జిని సందర్శించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు, ఇట్టి బ్రిడ్జి కారణంగా పైడిమడుగు, మాదాపూర్, జోగిన్ పల్లి, సర్పరాజు పల్లి గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, ఉపాధ్యక్షులు నయీమ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ సత్యనారాయణ, కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి, వైస్ ఛైర్మెన్ వెంకటేష్ గౌడ్, ఎంబేరి నాగభూషణం, నాయకులు అన్నం అనిల్, పుప్పాల ప్రభాకర్, కరుణాకర్ రావు, ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కల్లూరు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



