రాయికల్

భాషా పండితుల కు పదోన్నతులు కల్పించి టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి

viswatelangana.com

April 22nd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
  • గడెల భూపతి కర్ర శ్రీమతి ల ఉద్యోగ విరమణ సభలో ఆర్.యు.పి.పి.టి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి

కోరుట్ల బాలికల ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గడెల భూపతి అల్లీపూర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు కర్ర శ్రీమతి ల ఉద్యోగ విరమణ సభలో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జగిత్యాల జిల్లా శాఖ పక్షాన జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారు ఉద్యోగ జీవితం లో చేసిన సేవలను సామాజిక చైతన్యాన్ని జాతీయ భావాలను దేశభక్తి ని కొనియాడారు దేశం గర్వించే ఎందరో దేశభక్తులను తయారు చేసారని భావి జీవితం దేశ సమగ్రతకు జాతీయవాదుల నిర్మాణానికీ కృషి చేయాలని కోరారు సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయించాలని సుమారుగా గత ముప్పై సంవత్సరాలుగా భాషా పండితులు సమాన పనికి సమాన వేతనం సమాన గౌరవం లభించక వెట్టిచాకిరి శ్రమదోపిడికి గురౌతూ ఆత్మగౌరవం చంపుకొని పని చేస్తున్నారని భాషా పండితుల కు పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాయికల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వాసరి రవి మనోహరచారీ టిఆర్టిఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ గౌడ్ మండల విద్యాశాఖాధికారి మూలస్థం గంగాధర్ సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీపతి రాఘవులు గజ్జెల నరేందర్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button