కోరుట్ల
ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు
viswatelangana.com
May 15th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల నియోజకవర్గంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వేడి తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత తారాస్థాయికి చేరుతోంది. కాక పుట్టించే సూర్యకిరణాలు తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈసారి మరింత ఎండలు కాసే అవకాశం ఉంది. పెరుగుతున్న పగటిపూట ఉష్ణోగ్రతలతో బుధవారం ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తమ తమ విధులను సాయంత్రం నుంచి కొనసాగించుకున్నారు.



