రాయికల్
మాజీ సర్పంచ్ పై దాడిని ఖండిస్తున్నాం

viswatelangana.com
March 1st, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని రామారావు పల్లె కు చెందిన మాజీ సర్పంచ్ బీర మల్లయ్య పై శుక్రవారం సాయంత్రం ఊరి పొలిమేరు లో బ్రిడ్జి వద్ద ముగ్గురు గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం శోచనీయమని, అట్టి దాడిని రాయికల్ మండల యాదవ సంఘం ఖండిస్తున్నదని మండలం శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసరి రవి యాదవ్, లాల్ చావ్లా రాజేశ్ యాదవ్ లు ఒక ప్రకటనలో తెలిపారు. అట్టి గుర్తు తెలియని వ్యక్తులను, దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైనవి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రెబ్బాస్ మల్లయ్య యాదవ్, దంటిక రాజేశం యాదవ్, ఆసరి మల్లేష్ యాదవ్, గడ్డం మల్లారెడ్డి యాదవ్, కొమురయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.



