కోరుట్ల

ఆయిల్ ఫామ్ పంట పై అవగాహన సదస్సు

viswatelangana.com

May 9th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల మండలం యూసఫ్ నగర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఆయిల్ ఫామ్ పంట సాగు విధానంపై వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీహరి, హార్టికల్చర్ ఆఫీసర్ రజిత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు కోసం ప్రత్యేకంగా రాయితీ కల్పిస్తుందని అదేవిధంగా డ్రిప్ పరికరాలు కూడా సబ్సిడీపై అందజేస్తున్నామని తెలిపారు. కావున రైతులందరూ ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి పెట్టాలన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రైతు విశిష్ట సంఖ్య ఆన్లైన్లో నమోదు పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గుగ్గిళ్ళ సురేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను ఉపయోగించుకొని ఆయిల్ ఫామ్ సాగు చేయాలన్నారు. అదేవిధంగా రైతులందరూ రైతు విశిష్ట సంఖ్య నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షులు ముక్కెర లింబాద్రి, నాయకులు రైతులు బోండ్ల గంగరాజు, లక్ష్మీ నరసయ్య, మరిపెళ్లి శేఖర్, గడ్డం శేఖర్ రెడ్డి, ఏషాల గంగాధర్, కరిపే తుక్కయ్య, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button