అభివృద్ధి పనులను పరిశీలించిన జువ్వాడి నరసింగ్ రావు, కృష్ణారావు

viswatelangana.com
కోరుట్ల నియోజకవర్గం కేంద్రమైన కోరుట్ల పట్టణంలోని అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్.డి.ఎఫ్ )8 లక్షల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నరసింగ్ రావు గురువారం రోజు పరిశీలించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని ఈ సందర్భంగా కాంట్రాక్టర్ కు సూచించారు. 11 వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 20, 21, 22 తేదీ లలో లక్ష్మీదేవి అమ్మవారు విశ్వక్సేన, ఆంజనేయస్వామి ల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలకు భక్తులందరూ హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు ఉన్నారు.



