కథలాపూర్
వరద కాలువకు భూషణరావు పేట్ భూములకు సంబంధం ఏంటి?

viswatelangana.com
April 1st, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
- రాళ్లవాగు కాలువద్వారానే భూషణరావుపేటకు సాగునీరు.
- జెడ్పి చైర్ పర్సన్ వసంత వాక్యాలు అర్థరహితం.
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణ రావు పేట లో కాంగ్రెస్ నాయకులు సోమవారం విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఆదివారం రోజు భూషణరావుపేట లో పర్యటించి ఎండిన వరి పొలాలను పరిశీలించారు. భూషణరావుపేట శివారు భూములకు రాళ్లవాగు ప్రాజెక్టు ద్వారానే నీళ్లందుతాయని జెడ్పి చైర్ పర్సన్ కు తెల్వకపోవడం దారుణమని వరద కాలువ నీళ్లు లేకనే ఎండిపోయాయని జెడ్పి చైర్ పర్సన్ వసంత మాట్లాడడం తీరు చూస్తే ఈ ప్రాంతంపై అవగాహన లేదని తెలిసిపోయిందని . రాళ్ళవాగు కుడికాలువ మరమ్మత్తుల గురించి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే, ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు కోసం కృషిచేస్తున్నారని అన్నారు.



