కొడిమ్యాల
ఆలయమును సందర్శించిన దేవాదాయశాఖ అధికారులు

viswatelangana.com
June 21st, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయమును జిల్లా దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు, కొండగట్టు దేవస్తానం అర్చకులు సందర్శించి స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దూప దీప నైవేద్యం ఆలయాలను గుర్తించుటకొరకు సెలెక్షన్ కమిటీ కొడిమ్యాల మండలంలో ఆలయాలను సందర్శించడం జరిగింది. అధికారులు, అర్చకులు నూతనంగా నిర్మించిన మన ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆలయ అర్చకులు నాగరాజు రమేష్ దేవాదాయశాఖ అధికారులను, కొండగట్టు ఆలయ అర్చకులను సాదరంగా ఆహ్వానించి పండ్లు ప్రసాదాలను అందజేశారు



