వరి కొనుగోలు ధాన్యం కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

viswatelangana.com
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని డి సి ఎం ఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన పౌరసరఫరాల అధికారులు ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ చెడుపు వర్షాలు పడుతున్న సమయంలో కనీస సౌకర్యాలు టార్ఫాలిన్ కవర్స్ అందుబాటులో ఉంచుకోవాలని సెంటర్ నిర్వాహకులకు, రైతులకు సూచించారు రైతులు వరి ధాన్యం కుప్పలపై టార్ఫలిన్ కవర్లు కప్పుకోవాలని అలాగే కాంటా ఆయన సంచుల పైన వర్షం వచ్చిన సమయంలో తడవకుండా టార్ఫలిన్ కవర్లు కప్పి ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు, తూకం వేసిన ధాన్యం ను వెంటనే సంబందింత రైస్ మిల్లులకు పంపాలని ఆదేశించారు ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారులు డీటీసీస్ శ్రీనివాస్ ఫుడ్ ఇన్స్పెక్టర్ మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు



