రాయికల్
జీవశాస్త్రంలో విద్యార్థుల ప్రతిభ

viswatelangana.com
December 9th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో సోమవారం మండల స్థాయి జీవశాస్త్రం ప్రతిభ పరీక్షలు నిర్వహించారు. రాయికల్ మండలం మైతాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థి పారిపెల్లి సుప్రజ ఇంగ్లీష్ మీడియం విభాగం ప్రథమ బహుమతి సాధించింది. ఇటిక్యాల మోడల్ స్కూల్ విద్యార్టీని సుగందిక ద్వితీయ బహుమతి సాధించింది. తెలుగు విభాగంలో తాట్లావాయి ఉన్నత పాఠశాల విద్యార్థి లక్ష్మి, అల్లీపూర్ ఉన్నత పాఠశాల విద్యార్ధిని వర్ష వర్ధిని ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రాఘవులు, కలవకోట కార్తిక్, నరేష్, లక్ష్మికాంతం, రాజేష్, మండలం లోని సైన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



