కోరుట్ల
వసతులు లేక భక్తులకు ఇబ్బందులు

viswatelangana.com
January 13th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
ధనుర్మాసం సందర్భంగా కోరుట్ల పట్టణంలోని అతి పురాతన మైన శ్రీ వేంకటేశ్వర స్వామీ ఆలయంలో సోమవారం రోజు శ్రీ గోదారంగనాథుల కళ్యాణం వైభోగంగా నిర్వహించిన అన్న ప్రసాదం కార్యక్రమ సమయంలో మాత్రం భక్తులకు నీటి వసతి లేకా, తినడానికి ప్లేట్స్ లేక, అన్న ప్రసాదం మొదలుపెట్టిన గంటకే అన్నం అయిపోవడంతో కాలీ ప్లేట్లతో క్యూ కట్టిన భక్తులు, ప్రదర్శనకు మాత్రమే నీటి కుళాయిలు దర్శనమివ్వడంతో, అంచనా తప్పిన వంటకాల వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఇది ముమ్మాటికి ఆలయ మేనేజ్మెంట్ వారి అసమర్ధతేనని భక్తులు గుసగుసలాడుకున్నారు.



