కోరుట్ల
వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో రాములోరి పెళ్లికి పట్టు వస్త్రాలు

viswatelangana.com
April 17th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో పట్టు వస్త్రములు, తలంబ్రాలు, పూలు, పండ్లు సమర్పించారు. అధ్యక్షురాలు బూస మాధురి, కార్యదర్శి వెలుగూరి భాగ్య, కోశాధికారి జనగాం మధురిమ, జిల్లా ఇన్చార్జి నీలి లక్ష్మీ, లయన్స్ క్లబ్ జెర్సీ అల్లాడి శోభ మరియు వాసవి వనిత క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.



