దళారులను నమ్మి మోసపోవద్దు

viswatelangana.com
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని ఉప్పుమడుగు ఫ్యాక్స్ చైర్మన్ దీటి రాజరెడ్డి వైస్ చైర్మన్ దుంపల స్వామి రెడ్డి లు పేర్కొన్నారు. గురువారం రాయికల్ మండలంలోని ఆలూరు గ్రామంలో ఉప్పుమడుగు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే ధాన్యం తీసుకురావాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా గన్నీ బ్యాగుల కొరత లేకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం అధికారి మనోజ్, కార్యనిర్వాహణాధికారి తిరుపతి, రైతులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, ఫ్యాక్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



