విశ్వశాంతి పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ కేంద్రంలోని విశ్వశాంతి ఉన్నత పాఠశాలలో ముందస్తుగా హోళీ పండుగ వేడుకలను గురువారం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. విద్యార్థులు తోటి స్నేహితులతో ఎంతో ఆనందోత్సహాలతో రంగులు పూసుకుంటూ కేరింతలుచేశారు. ఈ వేడుకలను పురస్కరించుకొనిపాఠశాల ప్రిన్సిపాల్ మచ్చగంగాధర్ మాట్లాడుతూ… హోళీ పండుగ అనేది పురాణాల ప్రకారం హోళీకా అనే రాక్షసి మంటల్లో మాడి మసైపోయిన సందర్భంగా హోళీ పండుగ జరుపుకుంటారని అన్నారు. మహావిష్ణువు భక్తుడైన ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపుడు తన మాట వినకపోవడంతో ప్రహ్లాదుడిని చంపాలని హోళీక రాక్షసికి ఆదేశాలు ఇస్తాడని, ఈ క్రమంలో ప్రహ్లాదుడిని హోలికా మంటల్లో వేస్తుందని, ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి రక్షించడంతో ఆ మంటల్లో హోళీకా పడి కాలిపోతుందని,అప్పటి నుంచి ప్రజలు హోళీ పండుగను జరుపుకుంటారని తెలిపారు. హిందువుల నమ్మకం అంతే కాకుండా హోళీ పండుగ జరుపుకోవడం వెనుక హోళీకా దహనం కథ మాత్రమే కాదు మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉందని శివుడు తపస్సులో ఉండగా తపస్సును భగ్నం చేయడానికి కామదేవుడు పూల బాణాలు వేస్తాడని, దీంతో శివుడు ఆగ్రహంతో కామదేవుడి శరీరాన్ని తన మూడవ కంటిని తెరిచి బూడిద చేస్తాడని, తన భర్త కామదేవుడిని బతికించాలని రతీదేవి ప్రార్థన చేస్తుందని, కరుణామయుడైన పరమేశ్వరుడు చివరకు కామదేవుడికి ఊపిరి పోస్తాడని, అందుకే హోళీ ముందురోజు కాముడి దహన వేడుకలు జరుపుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత, విద్యాన్వేష్ ఉపాధ్యాయులు మహేష్, రంజిత్, షారు, సంజన, శృతి, ఇందూజ, మనీషా, రజిత, అపర్ణ, మమత, శ్రీజ, ప్రత్యూష, మమత, రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



