రాయికల్

విశ్వశాంతి పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం

viswatelangana.com

September 24th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని స్థానిక విశ్వశాంతి పాఠశాలలో ‘‘స్వచ్ఛతా హీ సేవ’’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థులందరూ “స్వచ్ఛతా హీ సేవా” ప్రతిజ్ఞ చేయడం జరిగింది. పాఠశాల ప్రిన్సిపాల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ కంపోస్టు షెడ్లలో తడి, పొడి చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్, గాజు వంటి వృత్తులను వేరుచేయడం, మిగిలిన తడి చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చే పనులు నిర్వహిస్తారు. వీటిని గ్రామాల్లో వ్యవసాయవాడకు ఉపయోగించేలా మార్పులు చేస్తారు అలాగే స్వచ్ఛతా ప్రాధాన్యంపై విద్యాలయాల్లో విద్యార్థులకు క్విజ్ పోటీల నిర్వహణ, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించేందుకు పలు చర్యలు తీసుకోనున్నారు. పిల్లలకు స్వచ్ఛతా ప్రాముఖ్యతను పాఠాల ద్వారా అందించడం ద్వారా, వారిలో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత విద్యాన్వేష్ మరియు ఉపాధ్యాయులు మహేష్, రంజిత్, షారు, రజిత, సంజన, మమత, శృతి, మనిషా, ఇందుజ, శ్రీజ, నాగరాణి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button