మెట్ పల్లి

ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లిలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు

viswatelangana.com

September 5th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :

స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లి యందు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ఆర్. వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి విద్యార్థి జీవితంలో గురువు స్థానము వెలకట్టలేనిదని, చీకటిని పారద్రోలి వెలుగును నింపే గురువులందరినీ సన్మానించుకునే, స్మరించుకునే కార్యక్రమమే ఈ ఉపాధ్యాయుల దినోత్సవం అని తెలియజేశారు .ఈ కార్యక్రమము అనంతరము కళాశాల అధ్యాపకులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి గోవిందుల వెంకటేష్ మరియు అధ్యాపకులు సిహెచ్ . శ్రీనివాస్, జగపతి,శ్రీనివాస్, మహేశ్వరి, నర్సయ్య, సుదర్శన్, ప్రతిభ మంజుల, కిరణ్ కుమార్, జాకీర్, నవీన్ కుమార్ మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button