కోరుట్ల
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం…

viswatelangana.com
April 6th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణ ఆదర్శనగర్ శ్రీ అష్టలక్ష్మి సహిత శ్రీ లక్ష్మీ నారాయణస్వామి దేవాలయంలో ఆదివారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు బూరుగు రామస్వామి గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అర్చకులు కార్తీక్ భరద్వాజ శర్మ వైదిక నిర్వహణలో నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే కళ్యాణాన్ని తిలకించేందుకు విచ్చేసిన భక్తుల సౌకర్యం కొరకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.



