శ్వాస మీద ధ్యాసే ధ్యానం….

viswatelangana.com
అలసిన మనసు కన్నా ప్రశాంతత ఉన్న మనసు చురుకుగా పని చేస్తుందని ఓషో ధ్యాన మగ్నో అన్నారు. శనివారం రాయికల్ మండలంలోని ఇటిక్యాల శివారులో గల నివేదిత కృష్ణారావు పిరమిడ్ క్షేత్రంలో ఓషో ధ్యాన మాగ్నో ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అదేవిధంగా ఓషో ధ్యాన పద్ధతులను పరిచయం చేస్తూ ఒకరోజు ధ్యాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన శిక్షకులు మాగ్నో మాట్లాడుతూ… ప్రతిరోజు కొన్ని నిమిషాలైనా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తే అది మనం కోరుకున్న విధంగా మనల్ని మనం మలుచుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. రోజులో అరగంట పాటైన ధ్యానం చేయడం శ్రేయస్కరమన్నారు. శ్వాస మీద ధ్యాసే ధ్యానమని, ధ్యానం చేయడం ద్వారానే ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉంటారని, ధ్యానం వ్యక్తిగత వికాసానికి తోడ్పడే ఏకైక సాధనమని ఓషో ధ్యానపద్ధతులు ఇందుకు తోడ్పడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాటిపల్లి గంగారెడ్డి, అనుపురం నాగేశ్వర్ గౌడ్, మండలోజు శ్రీనివాస్, రొట్టె శ్రీధర్, గ్రామ యువకులు మహేష్, మార్గం శ్రీనివాస్ మరిపల్లి వంశీ గౌడ్, సురకంటి రాజు, పాల్గొన్నారు.



