కొడిమ్యాల

ఘనంగా శ్రీ అభయఆంజనేయ స్వామి దేవాలయంలో పదహరవ వార్షికోత్సవం

viswatelangana.com

May 2nd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల పట్టణంలోని వాగు ఒడ్డున హనుమాన్ దేవాలయం లో పదహరవ వార్షికోత్సవ సంబరాలలో శ్రీ అభయాంజనేయ స్వామి ఉత్సవమూర్తి విగ్రహానికి108 కలశాలు చే జలాభిషేకం పదివేల తమలపాకులచే అర్చన జిల్లేడు దండల అలంకరణ 516 అరటి పండ్లతో వివిధ రకాల ఫలాల చే నూట ఎనిమిది కొబ్బరికాయల చే స్వామివారికి పంచామృత అభిషేకం వివిధ రకాల పూలమాలలతో అలంకరణ ఇరవై ఒక్క సారి హనుమాన్ చాలీసా దండకం పారాయణం నవగ్రహ హోమం నిర్వహించారు తదుపరి మధ్యాహ్నం మహా అన్నప్రసాద వితరణ ఈ కార్యక్రమంలో దెందుకూరి నర్సింగరావు, దెందుకూరి హరి పంతులు, దెందుకూరి భాస్కర్ పంతులు, హనుమాన్ దీక్ష స్వాములు భక్తులు మహిళ మాతలు యువకులు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు పాల్గొన్నారు వారికి హనుమాన్ సేవ సమితి కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

Related Articles

Back to top button