రాయికల్
సమస్యను పరిష్కరించిన ఎంపిఓ

viswatelangana.com
March 24th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపెల్లి గ్రామంలోని ఎస్.సి కాలని లో ఎండకాలానికి ముందే నీటి కోరత ఏర్పాడిందని కాలనీ కి సంబందించిన బోరు మోటర్ గత 25 రోజుల క్రితం కాలిపోయిందని, దానివల్లన కాలనీలోని కుటుంబాలకు నీరు అందక తీవ్ర ఇబ్బందులకి గురియవుతున్నామని ఆదివారం నిరసన తెలుపగా, విషయం తెలుసుకున్న మండల పరిషత్ అధికారిని సుష్మ వెంటనే స్పందించి, సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవదాస్ తో కలిసి కాలనిని సందర్శించి సమస్య పరిష్కారం కోసం వెంటనే నూతన బోర్ మోటార్ ను అమర్చి కాలని వాసులకు మంచి నీటి కష్టాలు తీర్చారు.



