విస్డం కిడ్స్ వరల్డ్ ప్లే స్కూల్లో రమణీయంగా రెడ్ కలర్ డే వేడుకలు

viswatelangana.com
పిల్లల్లో రెడ్ కలర్ యొక్క ప్రాముఖ్యతను గురించి తెలిపేందుకు స్థానిక విస్డం కిడ్స్ వరల్డ్ ప్లే స్కూల్ లో “రెడ్ కలర్ డే”వేడుకలను అత్యంత రమణియంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి మాట్లాడుతూ ఎరుపు రంగు అనేది శక్తి, అభిరుచి మరియు చర్యను సూచిస్తుందని, ప్రీ స్కూల్ పిల్లలకు మరింత అన్వేషించాలి అనే ఆసక్తిని రేకెత్తించి, ఇది రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. రెడ్ డే అంటే రంగును గుర్తించడం మరియు పేరు పెట్టడమే కాదు, ప్రకృతి, సంస్కృతి తో పాటు భాషల్లో దాని స్థానాన్ని అర్థం చేసుకోవడం కూడా. అందుకే పిల్లల్లో రెడ్ కలర్ యొక్క ప్రాముఖ్యతను గురించి తెలిపేందుకు ఈరోజు విస్డం కిడ్స్ వరల్డ్ ప్లే స్కూల్ లో రెడ్ కలర్ డే కార్యక్రమం ను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎద్దండి నివేదిత రెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.



