మంత్రి సీతక్క మీద బిఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై భగ్గుమన్న కోరుట్ల కాంగ్రెస్
మంత్రి సీతక్కకి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ, మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కోరుట్ల పట్టణ మరియు మండల కాంగ్రెస్

viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ఆదేశాలతో నేడు కోరుట్ల పట్టణ అలాగే మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎన్నో ఆశలు, ఆశయాలతో, ఆకాంక్షలతో తల్లి సోనియా గాంధీ ఆశీస్సులతో ఏర్పాటు జరిగిందని, కానీ గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం అసమర్థత విధానాల వల్ల రాష్ట్రం వెనక్కి పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం బాధ్యత తీసుకుని ఆమోదయోగ్యం అయినా రీతిలో, ఇచ్చిన హామీలను నెరవేరుస్తు రాష్ట్రాన్ని ముందుకు తీసుకు పోతున్న అంశం, ఏక కాలంలో రైతు రుణమాఫీ, స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం, మొదలగు విప్లవాత్మక పనుల వల్ల ప్రజల్లో రేవంత్ రెడ్డి సర్కార్ పాలన పట్ల ఒక మంచి అభిప్రాయం వ్యక్తం అవుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రతిష్టలను దెబ్బ తీయాలనే కుటిల రాజకీయ ప్రయత్నంలో భాగమే, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని అనే అంశం అని అన్నారు. కాంగ్రెస్ ప్రజా సర్కార్ మహిళలను చిన్న చూపు చూస్తోందని, విలువ ఇవ్వడం లేదని బిఆర్ఎస్ నాయకులు శ్రేణుల నిరసనలు అర్ధరహితం, ఆలోచన రాహిత్యం రాజకీయ కుట్ర అని అన్నారు. నాడు కౌశిక్ రెడ్డి మాజీ గవర్నర్ తమిళ సై మీద చేసిన అనుచిత వాక్యలు, మొన్న అసెంబ్లీలో మంత్రి సీతక్క మీద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చేసిన వాక్యలకు పూర్తి బాధ్యత కేసీఆర్, కేటీఆర్ లు తీసుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ వాళ్లకు అధికారం కోల్పోవడంతో పాటుగా, ఆలోచన విచక్షణ కోల్పోయి, ప్రజా ప్రభుత్వ రథసారథి రేవంత్ రెడ్డి మీద విషం చిమ్ముతున్నారని ఇది సబబు కాదని, ఎవరి ప్రభుత్వం మహిళా గౌరవం, భద్రత, మహిళా అభివృద్ధి, అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని అనేది ప్రజలకు స్పష్టంగా తెలుసని, మహిళలను అడ్డు పెట్టుకుని, బురద చల్లే శిఖండి రాజకీయాలు తగవు అని కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కోరుట్ల పట్టణ అలాగే మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు



