రాయికల్
సర్వపాప హరణం పంచాంగ శ్రవణం

viswatelangana.com
March 26th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
సర్వపాప హరణం పంచాంగ శ్రవణమని జ్యోతిష్య జ్ఞానరత్న అవార్డు గ్రహీత మునుగోటి రమేష్ శర్మ అన్నారు.బుధవారం జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో విశ్వావసు నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతిలో మార్పు సంభవించే ఉగాది నిజమైన కొత్త సంవత్సరమని అన్నారు.జగిత్యాల పట్టణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మోతె ఉమాకాంత్ మాట్లాడుతూ హైందవ సంస్కృతి సంప్రదాయాలలో ఉగాది రోజు పంచాంగం వినటం వల్ల సకల సంపదలు చేకూరుతాయని అన్నారు.ఈకార్యక్రమంలో పురోహితులు చెరుకు మహేశ్వర శర్మ, కొత్తపెల్లి శ్రీనివాస్,బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



