పలు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని రిమాండ్ కు పంపించిన ఎస్సై నవీన్ కుమార్

viswatelangana.com
తేదీ 15.04.2024 రోజున మధ్యాహ్నం సమయంలో కథలాపూర్ మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన నక్క సతీష్ అనునతని ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అట్టి దొంగల గురించి నిఘా పెట్టగా నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం అనగా తేదీ 17.04.2024 రోజున ఉదయం సమయంలో దొంగతనానికి పాల్పడినటువంటి బోధన్ కి చెందిన నలుగురు వ్యక్తులు అయిన 1. ఒడిబిడి పోశెట్టి , మరియు అతని భార్య లక్ష్మి 2. బింగి గంగమని w/o సాయిలు 3. జావేద్ ఖాన్ (ఆటో డ్రైవర్)అను వారిని పట్టుకొని వారి వద్ద నుండి 3000 రూపాయల నగదు మరియు ఒక ఆటో ను స్వాధీన పరచుకోనైనదని మరియు ఇంకొ నేరస్తుడు బింగి సాయిలు పరారి లో ఉన్నాడని,పైన తెలిపిన 5 గురు నేరస్థులు తక్కలపల్లి తో పాటు జగ్గసాగర్ మరియు వెల్పూర్ లోని లక్కోర గ్రామాలలో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని ఆ నలుగురిని రిమాండ్ కు పంపించినట్లు కథలపూర్ ఎస్. ఐ జి. నవీన్ కుమార్ తెలిపారు.



