కోరుట్ల

బాబు జగ్జీవన్ రామ్ మిని పంక్షన్ హాల్ కు 5లక్షల నిధులు మంజూరు

ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ పేట భాస్కర్

viswatelangana.com

April 5th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

దేశ మాజీ ఉప ప్రదాని, సమత వాది పుజ్య డా. బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల పక్షన నిలబడి వారి అభివృద్ధే లక్ష్యంగా పనిచేసిన మహానేత పెరిట కోరుట్లలో నిర్మించనున్న మిని పంక్షన్ హాల్ కు ఐదు లక్షల నిధుల ప్రకటించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగ్ రావుకు తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. శనివారం కోరుట్లలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద జరిగిన జయంతి ఉత్సవాలలో జగ్జీవన్ రామ్ విగ్రహనికి ఘనంగా పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ భారత దేశ ఔన్నత్యాన్ని దశదిశలా విస్తరించి కార్మిక రంగంలో అనేక సంస్కరణలకు అద్యుడుగా నిలిచి ఎనలేని సేవలు చేసిన మహానీయుడి బాబు జగ్జీవన్ రామ్ అని ఆయన పెరిట నిర్మించనున్న పంక్షన్ హాల్ కు ఐదు లక్షలు ఇవ్వనున్నట్లు వెంటనే టెండర్లు పిలుస్తామన్నారు. దేశ అత్యున్నత భారత రత్న అవార్డు ఇచ్చి బాబు జగ్జీవన్ రామ్ ను గౌరవించలాని పేట భాస్కర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కోరుట్ల ఆర్డీవో జివాకర్, మున్సిపల్ కమీషనర్ మారుతి ప్రసాద్ లు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకై అందరం పని చేయాలన్నారు.

Related Articles

Back to top button