కొడిమ్యాల

సుప్రజా హాస్పిటల్ మేనేజింగ్ చైర్మన్ డాక్టర్ శిగ విజయ్ కుమార్ కు గౌడ ప్రభంజనం డైరీ క్యాలెండర్ అందజేసిన ఎడిటర్

viswatelangana.com

April 9th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

హైదరాబాద్ మహానగరంలోని నాగోల్ లో గల సుప్రజా హాస్పిటల్ మేనేజింగ్ చైర్మన్ డాక్టరేట్ అవార్డు గ్రహీత డా శిగ విజయ్ కుమార్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసి గౌడ ప్రభంజనం జాతీయ మాసపత్రిక డైరీ క్యాలెండర్ ను అందచేయడం జరిగిందని గౌడ ప్రభంజనం జాతీయ మాసపత్రిక చీఫ్ ఎడిటర్ గౌడ ప్రభంజనం సేవా చారిటబుల్ ట్రస్ట్ గౌండ్ల ఆడబిడ్డ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి నిత్యాన్నదాన సత్రం (కొండగట్టు) చైర్మన్ మంద వేణుగోపాల్ గౌడ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రజా హాస్పిటల్ లో గీతా కార్మికులు తాటి చెట్టుపై నుండి కింద పడిన పేదవారికి ఉచితంగా వైద్య చికిత్స అందిస్తున్నారని ఇలాంటి మానవత్వం ఉన్న గొప్ప వ్యక్తిని కలవడం గర్వంగా ఉందని తెలిపారు. ఎవరైన గౌడ కులస్తులు పేదవారు వైద్యం కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వారి ఆర్థిక పరిస్థితిని బట్టి తక్కువ బిల్లులోనే మెరుగైన వైద్యం అందజేయడం జరుగుతుందని సుప్రజా హాస్పిటల్ మేనేజింగ్ చైర్మన్ డాక్టర్ శిగ విజయ్ కుమార్ తెలియజేసారని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో వైద్యం పేదలకు అందని ద్రాక్షల అయిన తరుణంలో ఇలాంటి సేవా గుణంతో పేదలకు సేవలందించే మానవతా మూర్తులు ఉండటం గొప్ప విషయం అని తెలిపారు. తాటి చెట్టుపై నుండి పడిన గౌడ గీతా కార్మికులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నందుకు గౌడ కులస్తులకు బిల్లులలో రాయితీలు కల్పిస్తున్నందుకు గౌడ ప్రభంజనం సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు.

Related Articles

Back to top button