కోరుట్ల
ఎన్ ఎస్ ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

viswatelangana.com
September 24th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జానియర్ కళాశాలలో మంగళవారం రోజున సెప్టెంబర్ 24 జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్ ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు కళాశాల ఆవరణను శుభ్రం చేయడం జరిగింది. ఎన్ ఎస్ ఎస్ మోటో నాట్ మి బట్ యు అని అన్నారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ గౌసూర్ రెహమన్, ఎన్ ఎస్ ఎస్ పి వో గంగాప్రసాద్, అధ్యాపకులు నటరాజన్, హబీబ్, శ్రీనివాస్, సుబ్రమణ్యం, మోయిజోద్దిన్, స్వరూప, సంధ్య, వసుధ, వంశీ, ప్రశాంత్, రాజు, శిరీష్ మరియు అధ్యాపక బృందం మరియు కళాశాల భోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



