సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట 16 వార్డ్ కౌన్సిలర్ బలిజ పద్మ రాజారెడ్డి

viswatelangana.com
ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందాని, జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ బలిజ పద్మా రాజారెడ్డి అన్నారు. శుక్రవారం వార్డులో మహాలక్ష్మి (సిలిండర్ల సబ్సిడీ) కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మహాలక్ష్మి కార్డులను అర్హులైన మహిళలందరికీ మంజూరు చేసారని తెలిపారు. కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు కృషితో నియోజకవర్గంలో పాటు కోరుట్ల మున్సిపాలిటీకి అత్యధిక మహాలక్ష్మి కార్డులు మంజూరు అయ్యాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందున్నారని అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమాన్ని అందిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. గత పాలకులు అభివృద్ధిని మరిచి కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారని ఆరోపించారు. మహాలక్ష్మి కార్డులు అందరి వారు మరోసారి సరైన పత్రాలను జత చేసి మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలని కోరారు. అర్హులందరికీ మహాలక్ష్మి కార్డులను అందించేందుకు కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు సహకారంతో అందరికీ అందే విధంగా కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ జగదీశ్వర్, ఆర్ పి పావని, కాంగ్రెస్ యూత్ నాయకుడు బలిజ శివ ప్రసాద్, కంబ ఆనంద్, గురువంతుల సత్తయ్య, కండ్లే నరేష్, మైస రాజేష్, సదుల ప్రకాష్, ఎండి కిజర్, గని బాయ్, శివ శివ, పసుల రవి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.



