రాయికల్
స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

viswatelangana.com
April 3rd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి గోదావరి ప్రాంతంలో మురళీధర గో ధామంలో ఈనెల12,13వ తేదీల్లో పంచగవ్య ప్రొడక్ట్స్,18 నుండి 20వ తేదీ వరకు ఫైవ్ లేయర్ మోడల్, పుడ్ పారెస్ట్ మల్టీ క్రాపింగ్, 21నుండి 28వ తేదీ వరకు సోలార్ ఎనర్జీ బల్బుల తయారి,30వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు మట్టిల్లు నిర్మాణం వంటి స్వయం ఉపాధి కోర్సుల్లో నిర్ణీత రుసుముతో శిక్షణ అందిస్తున్నట్లు మురళీధర గోదామం నిర్వాహకులు డాక్టర్ పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్, శిక్షణ వివరాలకు చరవాణి నెంబర్ 9849750854 యందు సంప్రదించాలని తెలిపారు.



