రైతు రణభేరి చలో కలెక్టరేట్

viswatelangana.com
జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో అక్టోబర్ 4 న తలపెట్టిన రైతు రణభేరీ చలో కలెక్టరేట్ రైతు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని రైతు సంఘాల రాష్ట్ర నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రాయికల్ మండలం లోని గ్రామలైన ఇటిక్యాల్ , రాయికల్, అయ్యోధ్య, అల్లీపూర్ లలో రైతులు, సంఘాల పెద్దలతో సమావేశం అవుతూ పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ సందర్బంగా రైతు నాయకులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్బం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు 2లక్షల రుణ మాపీ, రైతు భరోసా నిధులు విడుదల చెయ్యాలని, రైతులు పండించే వరి దాన్యం అన్ని రకాలకు 500 బోనస్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమం లో రైతు నాయకులు తురగ శ్రీధర్, భాగ్య లక్ష్మి, కురుమ మహిపాల్, బోడిగం శ్రీకాంత్, లచ్చన్న, మల్లారెడ్డి, ముద్దం రాము, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



