సొంతింటి కల నెరవేరబోతున్న తరుణంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పిన లబ్ధిదారులు

viswatelangana.com
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బడుగు బలహీన వర్గాల నిరుపేదల సొంత ఇంటి కలను ఇందిరమ్మ ఇండ్ల ను అందిస్తూ రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసిందే.అయితే కథలాపూర్ మండలం పోతారం గ్రామంలో ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది, తమ చిరకాల స్వప్నం నెరవేరుబోతున్న తరుణంలో లబ్ధిదారులు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఏనుముల రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు తోట్ల అంజయ్య మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పులి శిరీష హరి ప్రసాద్, తుక్కారామ్ నాయక్, కథలాపూర్ మండల హౌసింగ్ ఏఈ శ్రేయ ,కార్యదర్శి రాజేష్ గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సయ్య,పడకంటి మహేందర్ కారోబార్ గొర్ల రామకృష్ణ ఉంబరవేణి మల్లయ్య బిటుగు గంగాధర్ సిరికొండ లచ్చయ్య సిరికొండ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు



