కొడిమ్యాల
జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్ మండలంలోని పలు గ్రామాలు సందర్శన

viswatelangana.com
March 7th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని పలు గ్రామాలలో పర్యటించారు. నమిలకొండ గ్రామంలో ఏఈఓ లు చేస్తున్నటువంటి డిజిటల్ క్రాప్ సర్వే ని పరిశీలించడం జరిగింది. పూడూరు గ్రామంలోని పలు వరి పొలాలను పరిశీలించి వరి లో అగ్గితెలుగు ఉదృతి ఎక్కువగా ఉందని గమనించి అగ్గి తెగులు యాజమాన్య పద్ధతులు వివరించడం జరిగింది. తథనంతరం పూడూరు సొసైటీ లో యూరియా అమ్మకం, నిల్వ పరిశీలించడం జరిగింది. దీనిలో మండల వ్యవసాయ అధికారి జ్యోతి, ఏఈఓ రాజేష్, సొసైటీ సీఈఓ రాజేందర్, అభ్యుదయ రైతులు రాంరెడ్డి, రాజిరెడ్డి, గోపాలరెడ్డి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.



