viswatelangana.com
Date of Publish : 13 March 2025, 1:49 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
అంగన్వాడి కేంద్రంలో ముందస్తు హోలీ సంబరాలు

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం వడ్డెర కాలనీ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి టీచర్ సుజాత ఆధ్వర్యంలో ముందస్తు హోలీ సంబరాలు చిన్నపిల్లలు పేరెంట్స్ తో ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాల మధ్య గడిపారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ చిన్నపిల్లలతో హోలీ జరుపుకోవడం ఆనందదాయకమని, ఎల్లప్పుడూ అందరం కలిసిమెలిసి ఉండాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లులు మరియు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Change News Type