కోరుట్ల
జువ్వాడి నర్సింగరావు ఆదేశాలతో తక్షణమే స్పందించిన అధికారులు…
త్వరలోనే సిసి రోడ్డు నిర్మాణం చేపడతాం...

viswatelangana.com
September 5th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైన కల్లూరు లోలెవెల్ వంతెనను బుధవారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు సందర్శించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరగా వెంటనే స్పందించిన అధికారులు.. గురువారం కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సింగరావు ఆదేశాల మేరకు ఆర్.అండ్.బి అధికారులు డస్టుతో మరమ్మతులు చేపట్టారు. త్వరలోనే సిసి రోడ్డు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పుల్లూరు వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్లు రమేష్, సలీం, మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రసూల్, కాంగ్రెస్ నాయకులు ధననీ లక్ష్మణ్, సంకే రమేష్, దొమ్మటి భూమయ్య, కొమరయ్య, సంకే రాజు, నర్సయ్య, గంగాధర్, చెక్కల్ల శ్రీను, నారాయణ, కల్లూరు, సర్పరాజు పల్లి గ్రామాల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



