రాయికల్

అంగన్వాడి స్కూల్లో ఈసీసీఈ డే వార్షికోత్సవం

viswatelangana.com

April 4th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ ఈసిసిఈ డే వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ మూడు సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రంలో నిర్వహించే ఫ్రీ స్కూల్ కార్యక్రమాలకు హాజరయ్యేలా చూడాలని, ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా నాణ్యమైన విద్యను అందించేందుకు అంగన్వాడీ కేంద్రాలలో కూడా ఫ్రీ స్కూల్ పిల్లల యొక్క సిలబస్ బుక్స్ డిపార్ట్మెంట్ అందించనున్నారు. పిల్లలకు ఎల్కేజీ బుక్స్, 4+ పిల్లలకు యూకేజీ బుక్స్ విద్య అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందని, 3+, 4+ పిల్లలను ప్రతి సంవత్సరం జూలై, డిసెంబర్, ఏప్రిల్ నెలలో పిల్లల శారీరక, మేధో వికాసం, భాష నేర్చుకునే రీతులు, బడికి సంసిద్ధత వంటి అభివృద్ధి అంశాలపై తల్లులకు అవగాహన కల్పిస్తూ వారి పిల్లలు అభివృద్ధి పరిధిలోని అంశాలను ఎంతవరకు చేరుకోగలిగారు అన్నది వివరిస్తూ సంబంధిత అభివృద్ధి కార్డ్ ను తల్లులకు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ మ్యాకల దివ్య, మ్యాకల అన్నపూర్ణ, ఆయాలు పిల్ల తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button