అంగరంగ వైభవంగా భీమన్న రథోత్సవం
viswatelangana.com
రాయికల్ పట్టణంలో గత 150 సంవత్సరాల క్రితం నుండి కొనసాగుతున్న చరిత్రక భీమన్న రథోత్సవం ఘనంగా జరిగింది ముందుగా ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి రథం ముందుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ నిర్వహకుల పూజారులు అనంతరం రథోత్సవాన్ని జరిపించారు దావీతోల్లు మేక పిల్లల్ని గావు పట్టగా పట్టగా భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారుఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్దావ వసంత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు పోరండ్ల గ్రామం నుండి కోడలుగా వచ్చిన భీమక్క అనే మహిళ భీమేశ్వరుని ప్రతిష్టించగా జాతర చిన్నగా ప్రారంభమై ఇప్పుడు జిల్లా కేంద్రంలోని అతిపెద్ద జాతరగా పేరుగాంచింది దాదాపు 5 లక్షల పైగా భక్తులు జాతరకు వచ్చినట్లు ఒక అంచనా ఉంది చిన్న పిల్లల కేరింతల మధ్య బొమ్మల తినుబండారాల దుకాణాలు, జాయింట్ వీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయిసత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో సురక్షిత త్రాగునీటి సౌకర్యం కల్పించారుఈ కార్యక్రమంలో నిర్వాహకులు దేవుని నర్సయ్య రాజం లింగయ్య చిన్నరాజం రాజన్న రెడ్డి రాజేందర్ కునారపు భుమేష్పాల్గొన్నారు



