రాయికల్

అంగరంగ వైభవంగా శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణం

viswatelangana.com

December 20th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ పట్టణ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పవిత్రమైన కార్యక్రమంలో స్వామి మరియు అమ్మవార్లను భక్తి, శ్రద్ధలతో అలంకరించి, పూజలు నిర్వహించారు.ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై, స్వామి వారి దివ్య దర్శనం పొందారు. కళ్యాణోత్సవం సమయంలో స్వామి, అమ్మవార్ల మంగళసూత్రధారణ, తీర్థ ప్రసాదాలు, ప్రత్యేక హారతులు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ వేడుక అత్యంత ఆధ్యాత్మికంగా సాగింది. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Back to top button