కోరుట్ల
అంబేద్కర్ చూపుడు వేలు నిర్వీర్యం చేసినంత మాత్రాన మార్గం మర్వం ఖబడ్దార్
ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ డిమాండ్

viswatelangana.com
April 7th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలును ద్వంసం చేసిన వ్యక్తులను కటినంగా శిక్షించాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం కోరుట్లలో పాత్రికేయులతో పేట భాస్కర్ మాట్లాడుతూ జగిత్యాల మండలం మోరపల్లి గ్రామంలో మహానీయుడు అంబేద్కర్ విగ్రహన్ని ద్వంసం చేసిన దుండగులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పేట భాస్కర్ కోరారు. ఈకార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు సజ్జు, మోర్తాడ్ లక్ష్మీ నారాయణ నాయకులు షాహిద్ మహ్మద్ షేక్, గాలి నరేష్ తదితరులు పాల్గొన్నారు.



