రాయికల్
అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం

viswatelangana.com
August 21st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపెల్లి గ్రామంలో 2024 ఆగస్ట్ 01 న, సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురుతో కూడిన బెంచ్ 6:1 నిష్పత్తిలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 కి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కలిపిస్తూ ఆదేశాలు జారీ చేసి ఎస్సీ, ఎస్టీ, వర్గీకరణపై ఇచ్చిన అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన తీర్పును నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక జేఏసీ ఆధ్వర్యంలో వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ… ర్యాలీ నిర్వహించి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ బెక్కం తిరుపతి, మాల సంఘం అధ్యక్షులు అలుపట్ల లక్ష్మణ్ అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక జేఏసీ నాయకులు పాల్గొనడం జరిగింది.



