రాయికల్
అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన వారిని శిక్షించాలి

viswatelangana.com
March 8th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని కోరుట్ల క్రాసింగ్ వద్ద గల అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.సారంగాపూర్ మండలం నాగు నూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో చెంగలి గంగాధర్, ఆకు రాజేందర్, బైరి రాజేందర్, బురం నర్సయ్య, ముక్కెర శ్రీనివాస్, జై భీమ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.



