రాయికల్
ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి

viswatelangana.com
December 6th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామం లో అంబేద్కర్ సంఘము (మాల) ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ మహిపతి రెడ్డి, గ్రామ సేవా సమితి అధ్యక్షులు నల్లగంగారెడ్డి, నాయకులు కాటిపల్లి గంగారెడ్డి, రుక్కు భాయ్, సామల వేణు, వేముల మురళి, విష్ణు, మరియు మాజీ ప్రజాప్రతినిధులు అంబేద్కర్ సంఘ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



