మన ప్రెస్ క్లబ్ కార్యవర్గ విస్తరణ నూతన కమిటీ బాధ్యతలు నేటి నుంచి అమలోకి అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్

viswatelangana.com
గత రెండు సంవత్సరాల క్రితం ఏర్పడిన మన ప్రెస్ క్లబ్ కోరుట్ల పూర్తిస్థాయి కార్యవర్గ విస్తరణ గురువారం మన ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్, గౌరవ సలహాదారులు కటుకం గణేష్, గంగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టారు. ప్రధాన కార్యదర్శిగా కొండ్లెపు అర్జున్, ఉపాధ్యక్షునిగా సైదుగంగాధర్, న్యాయ సలహాదారులుగా బద్రి సృజన్, కోశాధికారిగా కట్టెకోల సురేష్, ఉత్సవ కమిటీ కన్వీనర్ గా వనతడుపుల నాగరాజు, కోకన్వీనర్ గా మచ్చ రాఘవేంద్ర, దాడుల కమిటీ కన్వీనర్ గా గిన్నెల శ్రీకాంత్, కోకన్వీనర్ గా బాలే అజయ్, కార్యవర్గ సభ్యులుగా గుడిసె కోటేష్, కోడూరి ప్రేమ్ కుమార్, చంద్రకంటి శ్రీధర్, చింతోజి రాధాకృష్ణ, మంచికట్ల విజయకుమార్ లను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్, గౌరవ సలహాదారులు కటకం గణేష్, గంగుల శ్రీనివాస్ లు శాలువాతో సన్మానించారు. నూతన కార్యవర్గానికి మన ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారులు నీలి అనిల్, ఉపాధ్యక్షులు లింగ ఉదయ్ కుమార్, పాత్రికేయులు తీగల శోభన్ రావు, కత్తి రాజ్ శంకర్, మిట్టపల్లి బుచ్చిరెడ్డి, వనతడపుల సంజీవ్, చిట్యాల గంగాధర్, దయా మదన్, వెంకట్ రెడ్డి భార్గవ్, కొయల్కర్ ప్రవీణ్, తుమ్మల శేఖర్, డాక్టర్ మ్యాకల సూర్య ప్రకాష్, సంఘ మహేష్, వనతడుపుల మహా తేజ, జాగిలం కరుణాకర్, బచ్చు వంశీకృష్ణ తదితరులు అభినందించారు.



