రాయికల్
అగ్నికి ఆహుతైన పశుగ్రాసం

viswatelangana.com
March 12th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని శివాలయం కు అతి సమీపంలో ఉన్న ఆవుల పోషణ నిమిత్తం దాతలు అందజేసిన పశుగ్రాసం ( గడ్డి కట్టలు) ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగి అగ్నికి ఆహుతి అయ్యాయి.దాదాపు50 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని శివసేవకులు తెలిపారు. మరి కొంత మంది దాతలు ముందుకు వచ్చి పశుగ్రాసాన్ని అందజేయాలని విజ్ఞప్తి చేశారు.వేసవికాలం సమీపిస్తున్న సమయంలో మరిన్ని అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అగ్నిమాపక శకటం అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.



