viswatelangana.com
Date of Publish : 02 April 2025, 3:50 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
అగ్ని వీర్ గా ఎంపికైన కోరుట్ల రామకృష్ణ కళాశాల విద్యార్థి

కోరుట్ల పట్టణంలో గల రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో బీకాం పూర్తి చేసుకున్న మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామానికి చెందిన కొడిమ్యాల శ్రీపాల్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నివీర్ ఫలితాలలో అగ్నివీరుగా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా శ్రీ పాల్ ను కళాశాల కరస్పాండెంట్ యాద రామకృష్ణ, డైరెక్టర్ గాడి పెళ్లి హరిప్రియ అంజయ్య గౌడ్, ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ మరియు అధ్యాపక బృందం అభినందించారు.

Change News Type